Ayesha Khan | ఏం కావాలయ్యా మీకూ.. స్టిల్ ఫొటోగ్రాఫర్లను తెగ తిట్టిపోసిన బిగ్‌బాస్ భామ!
అందాలు ఆరబోసే హీరోయిన్ల ఫొటోలకు ఆదరణ ఉండనిదెప్పుడు? ఓ సెలెబ్రిటీ పిక్ సోషల్ మీడియాలో ఇలా అప్లోడ్ అవ్వడంతోనే గంటల్లో మిలియన్ల వ్యూస్ వచ్చేస్తుంటాయి. ఫాలోవర్సూ, లవర్సూ మరీ ఇంతలా చూసేస్తుంటే ఫొటోగ్రాఫర్లు మాత్రం స్టిల్స్ కోసం ఎగబడకేం చేస్తారు?
Ayesha Khan | అందాలు ఆరబోసే హీరోయిన్ల ఫొటోలకు ఆదరణ ఉండనిదెప్పుడు? ఓ సెలెబ్రిటీ పిక్ సోషల్ మీడియాలో ఇలా అప్లోడ్ అవ్వడంతోనే గంటల్లో మిలియన్ల వ్యూస్ వచ్చేస్తుంటాయి. ఫాలోవర్సూ, లవర్సూ మరీ ఇంతలా చూసేస్తుంటే ఫొటోగ్రాఫర్లు మాత్రం స్టిల్స్ కోసం ఎగబడకేం చేస్తారు? పాపం అలా లెన్స్ జూమ్ చేస్తూ కనిపించీ కనిపించనట్టుగా ఉన్న ఆ బాలీవుడ్ భామ అందాల్ని ఒడిసి పట్టేయాలని ప్రయత్నించిన ఫొటోగ్రాఫర్లకు మడతడిపోయింది.
ఔను, బిగ్‌బాస్ (హిందీ) షో ఫేమ్ అయేషా ఖాన్ ఇటీవల స్టిల్ ఫొటోగ్రాఫర్లను తెగ తిట్టిపోసిందట. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లోని మోత.. లిరికల్ సాంగ్‌లో తన గ్లామర్‌తో అభిమానుల గుండెల్ని ఓ మోత మోగించిందీ సుందరి. ఈ సినిమా మేలో విడుదల కానుండగా, అయేషా ఖాన్ నటించిన మరో సినిమా ‘ఓం భీమ్ బుష్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలతో తెలుగునాట పాపులర్ అయిన ఈ బ్యూటీ పబ్లిక్ ఈవెంట్లలో బిజీగా ఉంటున్నది.
ఈ నేపథ్యంలో ఫొటోగ్రాఫర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ వారిపై చిందులు వేసిందట. హద్దు మీరి సెలెబ్రిటీల ఫొటోలు తీస్తున్నారంటూ ఆరోపించింది. ఫొటోగ్రాఫర్ల అసభ్య ప్రవర్తన, అనుచిత కోణాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులతో చెలరేగిపోతున్నది. అమర్యాదగా ప్రశ్నిస్తారంటూ, అసౌకర్య క్షణాల్లో ఫొటోలు తీస్తారంటూ తప్పు పట్టింది. ‘ఏమిటి ఈ యాంగిల్స్? ఎక్కడ జూమ్ చేస్తున్నారు? అనుమతి అక్కర్లేదా?!..’ అంటూ ప్రశ్నించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

