Bichagadu-2 Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న బిచ్చగాడు-2 ట్రైలర్.. తొలిపార్టుకు మించి ఉందిగా..!
Bichagadu-2 Movie Trailer | కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ‘బిచ్చగాడు’ ఒకటి. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రిలీజైన ఈ సినిమా టాలీవుడ్లో తిరుగులేని విజయాన్ని సాధించింది.
Bichagadu-2 Movie Trailer | కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ‘బిచ్చగాడు’ ఒకటి. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రిలీజైన ఈ సినిమా టాలీవుడ్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. అప్పట్లో ఈ సినిమాకు పోస్టర్లు కూడా ఎక్కువగా అతికించలేదు. కేవలం గోడలపై బిచ్చగాడు సినిమా విడుదల అంటూ రాసారు. అలా లో ప్రమోషన్లతో ఈ సినిమా విడుదలైంది. తొలిరెండు రోజులు థియేటర్లలో జనాలే లేరు. కానీ ఆ తర్వాత మౌత్ టాక్‌తో జనాలు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. రూ.2.2 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా తెలుగులో రూ. 14కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఘన విజయం సాధించింది.
ప్రస్తుతం అందరి కళ్లు బిచ్చగాడు-2 పైనే ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 19న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. లక్ష కోట్లకు వారసుడిగా విజయ్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. తొలిపార్టులో లానే సీక్వెల్లో కూడా దీక్ష పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సీక్వెల్ బ్రేయిన్ ట్రాన్స్‌ప్లెంటేషన్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇక ట్రైలర్‌ను గమనిస్తే సీక్వెల్ చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ ట్రైలర్‌తో రెట్టింపు అయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

