Bichagadu-2 Movie | తొలిరోజే కోట్లు కొల్లగొట్టిన బిచ్చగాడు-2 మూవీ.. టైర్-2 హీరోలకు ధీటుగా కలెక్షన్లు
Bichagadu-2 Movie Collections | 'బిచ్చగాడు' అనే బ్రాండ్ నేమ్ తప్పితే పార్ట్-2పై తెలుగులో ఏమంత బజ్ ఏర్పడలేదు. ప్రమోషన్లు గట్రా కూడా భారీ స్థాయిలో జరుపలేరు. ఇక టీజర్, ట్రైలర్లు కూడా సినిమాపై ఓ మోస్తరు అంచనాలే క్రియేట్ చేశాయి.
Bichagadu-2 Movie Collections | ‘బిచ్చగాడు’ అనే బ్రాండ్ నేమ్ తప్పితే పార్ట్-2పై తెలుగులో ఏమంత బజ్ ఏర్పడలేదు. ప్రమోషన్లు గట్రా కూడా భారీ స్థాయిలో జరుపలేరు. ఇక టీజర్, ట్రైలర్లు కూడా సినిమాపై ఓ మోస్తరు అంచనాలే క్రియేట్ చేశాయి. గట్టిగా మాట్లాడితే పబ్లిసిటీ ఖర్చులు కూడా వేళ్ల మీద లెక్కేయోచ్చు అనే మాటలు కూడా వినిపించాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమాను టాప్ బయర్లు కూడా కొనలేదు. వెస్ట్ గోదావరి లోకల్ బయ్యర్ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నాడు. ఇక శుక్రవారం రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాకే తెచ్చుకుంది. పాత కథలనే మిక్సీలో వేసి చూపించాడని బోలెడు నెగెటీవ్ కామెంట్స్ వచ్చాయి.
కట్ చేస్తే తొలిరోజే కళ్లు చేదిరే కలెక్షన్లు సాధించింది. తమిళ కలెక్షన్లకు ఏమాత్రం తగ్గని రేంజ్లో ఈ సీక్వెల్‌కు తెలుగు కలెక్షన్లు వచ్చాయి. బిచ్చగాడు-2 తొలిరోజే దాదాపు రూ.4 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ మధ్య ఆ రేంజ్ కలెక్షన్లు సాధించలేకపోయారు. మణిరత్నం ఎపిక్ డ్రామా పొన్నియన్ సెల్వన్ సైతం ఈ సినిమాకు దరిదాపుల్లో కూడా లేదు. దీన్ని బట్టి చూస్తే బిచ్చగాడు సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఏడేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు తెలుగులో కోట్లు కొల్లగొట్టింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే రూ.26 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుంది. దానికి తోడు ఈ సినిమాకు పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోవడం ‘బిచ్చగాడు-2’కు కలిసొచ్చే అంశమే. ఇక వచ్చే వారం కూడా మేము ఫేమస్ తప్పితే పెద్ద సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. ప్రేక్షకులకు కూడా ఇప్పుడు ఇంకో ఆప్షన్ కనిపించడం లేదు. దాంతో బిచ్చగాడుకు మంచి బుకింగ్స్ వస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

