Bichagadu-2 Movie | బిచ్చగాడు-2 మ్యూజికల్ అప్డేట్.. ఆసక్తి రేకెత్తిస్తున్న పోస్టర్
Bichagadu-2 Movie Musical Update | ఏడేళ్ల క్రితం విడుదలైన బిచ్చగాడు ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం.
Bichagadu-2 Movie Musical Update | ఏడేళ్ల క్రితం విడుదలైన బిచ్చగాడు ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన స్నీక్ పీక్ వీడియో, థీమ్ సాంగ్ ఈ సీక్వెల్ పై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. బ్రెయిన్ ట్రాన్స్ ప్లంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు తమిళనాట, ఇటు తెలుగులో మంచి హైపే ఉంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్ లను ప్రకటిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని మ్యూజికల్ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీలోని చెల్లి వినవే అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ ను బుధవారం సాయంత్రం 4గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చేతిపై రాణి పాప అని రాసుంది. చెయి పక్కన గ్రద్ద కూడా ఉంది. పోస్టర్ తోనే సాంగ్ పై ఆసక్తిని క్రియేట్ చేశారు. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కు జోడీగా కావ్యా థాపర్ నటిస్తుంది. కాగా మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్లు చేయలేదు. మరి ఈ సినిమా అదే రోజున విడుదలవుతుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇది సత్య చేతి🔥#Bichagadu2
చెల్లి వినవే
Day after tomorrow at 4pm pic.twitter.com/O5R6WF331e— vijayantony (@vijayantony) April 10, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

