విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న సినిమా ‘బిచ్చగాడు 2’. కావ్య థాపర్ నాయికగా కనిపించనుంది. ఫాతిమా నిర్మాత. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు విజయ్ ఆంటోనీ. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ…“బిచ్చగాడు’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. ఈ సినిమా దాని కంటే పెద్ద కాన్వాస్‌లో రూపొందించాం. మొదటి చిత్రంలో తల్లి సెంటిమెంట్ ఉంటే, ఇందులో సిస్టర్ సెంటిమెంట్ చూస్తారు’ అన్నారు. హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ..‘భావోద్వేగాల కలబోతగా ఈ సినిమా ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరిదాకా కథలోని అనేక మలుపులు ఆకట్టుకుంటాయి’ అని చెప్పింది.