Bichagadu-2 Movie | బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న బిచ్చగాడు-2.. లాభాల బాటలో డిస్ట్రిబ్యూటర్లు
Bichagadu-2 Movie break even Completed | ‘బిచ్చగాడు’ అనే బ్రాండ్ నేమ్ తప్పితే పార్ట్-2పై తెలుగులో ఏమంత బజ్ ఏర్పడలేదు. ప్రమోషన్లు గట్రా కూడా భారీ స్థాయిలో జరుపలేరు. ఇక టీజర్, ట్రైలర్లు కూడా సినిమాపై ఓ మోస్తరు అంచనాలే క్రియేట్ చేశాయి.
Bichagadu-2 Movie break even Completed | ‘బిచ్చగాడు’ అనే బ్రాండ్ నేమ్ తప్పితే పార్ట్-2పై తెలుగులో ఏమంత బజ్ ఏర్పడలేదు. ప్రమోషన్లు గట్రా కూడా భారీ స్థాయిలో జరుపలేరు. ఇక టీజర్, ట్రైలర్లు కూడా సినిమాపై ఓ మోస్తరు అంచనాలే క్రియేట్ చేశాయి. గట్టిగా మాట్లాడితే పబ్లిసిటీ ఖర్చులు కూడా వేళ్ల మీద లెక్కేయోచ్చు అనే మాటలు కూడా వినిపించాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమాను టాప్ బయర్లు కూడా కొనలేదు. వెస్ట్ గోదావరి లోకల్ బయ్యర్ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నాడు. ఇక శుక్రవారం రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాకే తెచ్చుకుంది. పాత కథలనే మిక్సీలో వేసి చూపించాడని బోలెడు నెగెటీవ్ కామెంట్స్ వచ్చాయి.
బిచ్చగాడు సినిమాకు దరిదాపుల్లో లేదని విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే తొలిరోజే కళ్లు చేదిరే కలెక్షన్లు సాధించింది. తమిళ కలెక్షన్లకు ఏమాత్రం తగ్గని రేంజ్లో ఈ సీక్వెల్‌కు తెలుగు కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు అనుకుంటే రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లేనే అది కూడా డివైడ్ టాక్‌తో ఆ రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుందంటే మాములు విషయం కాదు. ఇక సీక్వెల్‌తో డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు ఖాయమని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ఏడేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు తెలుగులో కోట్లు కొల్లగొట్టింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే రూ.26 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుంది. దానికి తోడు ఈ సినిమాకు పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోవడం ‘బిచ్చగాడు-2’కు బాగానే కలిసొస్తుంది. ఇక తాజాగా విజయ్ ఆంటోని ఈ సినిమాకు మూడో పార్ట్ కూడా తెరకెక్కనున్నట్లు ప్రకటించాడు. మూడో భాగం 2025లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

