సునీల్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’. మిర్త్ యలమంద చరణ్ దర్శకుడు. కిరణ్, వీఎస్కే నిర్మాతలు. ఈ నెల 12న చిత్రం విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
దర్శకుడు మాట్లాడుతూ ‘కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా, పూర్తి వైవిధ్యమైన కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలయ్యే అంశాలుంటాయి. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.