Bhimaa Movie OTT | ఓటీటీలోకి గోపీచంద్ ‘భీమా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Bheema Movie | టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు.
Bheema Movie | టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 25 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించగా.. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు. ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా అలరించిన ఇందులో వెన్నెల కిషోర్, రఘుబాబు, నాజర్, నరేష్ కీలకపాత్రల్లో నటించారు.
Surprise surprise!
Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అది కర్ణాటకలోని పరశురామ క్షేత్రం- మహేంద్రగిరి. ఆ ప్రాంతంలో దివ్యఔషధ గుణములుండే మొక్కలు వుంటాయి. అలాగే ఓ మహిమ గల శివాలయం వుంటుంది. చనిపోయిన వారి చివరి కోరిక న్యాయ బద్దమైనదైతే, ఆ శివాలయంలో పూజలు చేస్తే ఆ కోరిక తీరుతుంది. అయితే అనూహ్యంగా ఆ గుడిని మూసివేయాల్సి వస్తుంది. సరిగ్గా ఐదు దశాబ్దాల తర్వాత అదే ఊరికి పోలీస్ ఇన్స్పెక్టర్ గా వస్తాడు భీమా (గోపీచంద్). తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న రౌడీ భవాని కి ఎలా బుద్ధి చెప్పాడు? ఈ కథలో రవీంద్ర వర్మ( నాజర్) పాత్ర ఏమిటి ? మూతపడిన గుడికి భీమాకి వున్న సంబంధం ఏమిటి ? ఇవన్నీ తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

