Bheemla Nayak: భీమ్లా నాయక్ రికార్డుల వేట మొదలు పెట్టేశాడు..!

వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ తుది దశలో ఉండగా, క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు మూవీ కూడా మరి కొద్ది రోజులలో పూర్తి కానుంది.దీని తర్వాత పవన్.. . హరీష్ శంకర్ మూవీ మొదలు పెట్టనున్నాడు.ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు.
అయితే ఇటీవల భీమ్లా నాయక్‌కు సంబంధించి క్రేజీ అప్డేట్స్ఇస్తూ ఫ్యాన్స్‌ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు మేకర్స్. పవన్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. టాలీవుడ్లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ఈ సాంగ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ.. ‘భీమ్లా నాయక్’ నుంచి మరో పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి పవన్ అభిమానులను హుషారెత్తించింది.
టైటిల్ సాంగ్ థమన్ సంగీత సారథ్యంలో రూపొందగా, దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మొగులయ్య, జోసెఫ్, థమన్, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, రామ్ మిరియాల ఆలపించిన తీరు శ్రోతలను కట్టిపడేస్తోంది. దీంతో యూట్యూబ్ వ్యూస్ పరంగా ఈ సాంగ్ ఓ రేంజ్లో దూసుకుపోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- సంభాషణలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా.. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

