Bheemla Nayak 3 days | 3 రోజుల్లోనే సెంచరీ..100 కోట్ల క్లబ్బులో భీమ్లా నాయక్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మరోసారి బాక్సాఫీసు దగ్గర సంచలనం సృష్టిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాసిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర (Sagar K Chandra) దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భీమ్లానాయక్ సినిమాను నిర్మించాడు. మొదటిరోజు పాజిటివ్ టాక్ రావడంతో ఎక్కడా తగ్గడం లేదు పవన్ కళ్యాణ్.
2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సత్తా చూపిస్తుంది ఈ సినిమా. మూడోరోజు తెలుగు రాష్ట్రాల్లో 13.5 ఒక కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఊహించిన కలెక్షన్స్ రాలేదు. లేదంటే ఈ పాటికి సినిమా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసేది అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతానికి మూడు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఒకసారి చూద్దాం..
ప్రాంతాల వారీగా కలెక్షన్లు..
నైజాం: 25.88 కోట్లు
సీడెడ్: 7.02 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.66 కోట్లు
ఈస్ట్: 3.60 కోట్లు
వెస్ట్: 3.91 కోట్లు
గుంటూరు: 3.88 కోట్లు
కృష్ణా: 2.31 కోట్లు
నెల్లూరు: 1.81 కోట్లు
ఏపీ, తెలంగాణ 3 డేస్ కలెక్షన్స్: 53.07 కోట్లు (79 కోట్లు గ్రాస్)
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 6.10 కోట్లు
ఓవర్సీస్: 10.02 కోట్లు
వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్: 69.19 కోట్లు (108 కోట్లు గ్రాస్)
భీమ్లా నాయక్ సినిమాకు రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. ఇప్పుడు వాళ్ల నమ్మకం నిజమైంది.. కలెక్షన్ల పంట పండుతుంది. 4వ రోజు నుంచి వచ్చే వసూళ్లు బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. వచ్చే వారం కూడా పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కచ్చితంగా పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించేలా కనిపిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

