అమ్మ కదిలి వచ్చే..
భక్తి పారవశ్యంలో ఊరేగే అమ్మవారు, అడుగడుగునా ఆధ్యాత్మిక శోభతో అలరారే ఉత్సవాలు, నవదుర్గలు తొమ్మిది రూపాల్లో ఆవిష్కృతమయ్యే దైవభక్తి.. ఈ వైభవాన్ని ఆవిష్కరిస్తూ గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రక చిత్రం ‘భరతవర్ష’ నుంచి ‘అమ్మ కదిలి వచ్చే’ అనే పాట విడుదలైంది.
సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. క్రీ.శ. 642 నాటి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘అమ్మ కదిలి వచ్చే’ పాటకు అనుదీప్దేవ్ సంగీతాన్నందించారు. కల్యాణ్చక్రవర్తి త్రిపురనేని ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు.
దుర్గాదేవి ఆరాధనలోని వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఇందులో శూలాంభ అమ్మవారి ఉత్సవ ఊరేగింపును చూపించారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి…వంటి అమ్మవారి తొమ్మిది రూపాలను ఈ పాటలో వేడుకగా చూపించడం ప్రధానాకర్షణగా నిలిచింది. నాయకానాయికలు గోపీచంద్, రీతూవర్మ ఈ పాటలో అద్భుతంగా కనిపించారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్దేవ్, దర్శకత్వం: సంకల్ప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

