Bharata Varsha | గోపీచంద్ ‘భరతవర్ష’ గ్లింప్స్ విడుదల.. యోధుడిగా అదిరిపోయే లుక్, దేశభక్తి కథపై అంచనాలు పీక్స్!
Bharata Varsha | యాక్షన్ హీరో గోపీచంద్ మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వరుస ఫ్లాప్స్ తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ఈసారి పూర్తిగా భిన్నమైన కథతో ‘భరతవర్ష’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక సినిమా పై ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోలో గోపీచంద్ యోధుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
Bharata Varsha | యాక్షన్ హీరో గోపీచంద్ మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వరుస ఫ్లాప్స్ తర్వాత సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ఈసారి పూర్తిగా భిన్నమైన కథతో ‘భరతవర్ష’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక సినిమా పై ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోలో గోపీచంద్ యోధుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటూ యుద్ధరంగంలో విరుచుకుపడే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి సినిమా గ్రాండ్‌గా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తున్నాయి.
‘భరతవర్ష’ అనే టైటిల్‌కు కూడా ప్రత్యేకమైన అర్థం ఉంది. పురాణాల ప్రకారం భరతవర్షం అంటే హిమాలయాల నుంచి సముద్రం వరకు విస్తరించిన అఖండ భారతదేశాన్ని సూచిస్తుంది. చక్రవర్తి భరతుడి పేరుమీదుగా ఈ పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. ఈ నేపథ్యంలో సినిమా దేశభక్తి, చరిత్ర, మైథాలజీ అంశాలను మేళవించి రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ఇండిపెండెన్స్‌కు ముందు జరిగే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కథలో మైథాలజీ టచ్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ కలయికతో సినిమా మరింత ఆసక్తికరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందట. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని, మేకర్స్ ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. గోపీచంద్ కెరీర్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, టైటిల్ ప్రభావం చూస్తే ‘భరతవర్ష’తో ఆయన బలమైన కంబ్యాక్ ఇవ్వడం ఖాయం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

