మన మధ్య జరిగే కథ
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. జే. శివసాయివర్ధన్ దర్శకుడు. ఎన్.వి.కిరణ్‌కుమార్ నిర్మాత. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భలే ఉన్నాడే’. జే. శివసాయివర్ధన్ దర్శకుడు. ఎన్.వి.కిరణ్‌కుమార్ నిర్మాత. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఆయన టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ‘రాజ్‌తరుణ్‌తో మంచి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. దర్శకుడు సాయికి ఈ పాయింట్ చెబితే తను బాగా డిజైన్ చేసుకొని తీసుకొచ్చాడు. ఇది కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. మన మధ్యలో జరిగే కథలా ఉంటుంది. శేఖర్‌చంద్ర మంచి పాటలిచ్చారు’ అన్నారు. మారుతితో సినిమా చేయాలనే కల ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని హీరో రాజ్‌తరుణ్ తెలిపారు. దర్శకుడిగా తనకిది మొదటి చిత్రమని, ఆద్యంతం నవ్విస్తుందని జె.శివసాయివర్థన్ చెప్పారు. ఈ సినిమాలో కామెడీ కొత్త పంథాలో ఉంటుందని, పాటలు బాగా కుదిరాయని, సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్లా, సమర్పణ: మారుతి టీమ్, ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచ్చ, దర్శకత్వం: జె.శివసాయివర్ధన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

