కార్తికేయ సూపర్ స్టార్ అవుతాడు.. శర్వానంద్
‘కార్తికేయ ఆల్‌రౌండ్. యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్ని జానర్స్ చేయగల నటుడు. తను తప్పకుండా సూపర్‌స్టార్ అవుతాడు’ అని హీరో శర్వానంద్ నమ్మకం వెలిబుచ్చారు. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘భజేవాయువేగం’.
‘కార్తికేయ ఆల్‌రౌండ్. యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్ని జానర్స్ చేయగల నటుడు. తను తప్పకుండా సూపర్‌స్టార్ అవుతాడు’ అని హీరో శర్వానంద్ నమ్మకం వెలిబుచ్చారు. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘భజేవాయువేగం’. ఐశ్వర్య మీనన్ కథానాయిక. ప్రశాంత్‌రెడ్డి దర్శకుడు. ప్రతిష్టాత్మక యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ యు/ఏ సర్టిఫికెట్ పొందినది. నేడు (శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన శర్వా ఇంకా మాట్లాడుతూ ‘ ఈ టీమ్‌లో చాలామందితో పనిచేశాను. దర్శకుడు ప్రశాంతే ఈ సినిమాకు నిజమైన హీరో.
తనెప్పుడు మాస్ మాస్ అని కలవరిస్తాడు. ఆ తరహా కథలే రాస్తాడు. తను ‘రన్ రాజా రన్’ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. అప్పుడే అనుకున్నా ఇతను పెద్ద డైరెక్టర్ అవుతాడని. కచ్చితంగా అందరూ మెచ్చే సినిమాగా ఈ ‘భజే వాయువేగం’ నిలుస్తుంది అని శర్వానంద్ నమ్మకంగా చెప్పారు. ‘ ఎలాంటి కథకోసం ఇన్నాళ్లూ ఎదురు చూశానో, అలాంటి కథే ‘భజేవాయువేగం’. ముందు దర్శకుడు ప్రశాంత్‌రెడ్డికి థ్యాంక్స్. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఆ స్థాయి విజయం రాలేదు. ఆ లోటు ఈ సినిమా తీర్చేస్తుంది’ అని కార్తికేయ అన్నారు. అన్నీ కుదిరిన సినిమా ‘భజేవాయువేగం’ అని చెబుతూ.. సహకరించిన అందరికీ దర్శకుడు ప్రశాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అతిథులుగా విచ్చేసిన మేర్లపాక గాంధీ, వశిష్ఠ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్రయూనిట్ సభ్యులంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

