Bhaje Vaayu Vegam | ఫాదర్ సెంటిమెంట్‌తో వస్తున్న ‘భజే వాయు వేగం’.. టీజర్ చూశారా.?
Bhaje Vaayu Vegam | ఆర్ ఎక్స్ 100(RX100) ఫేమ్ కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’(Bhaje Vaayu Vegam). యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Bhaje Vaayu Vegam | ఆర్ ఎక్స్ 100(RX100) ఫేమ్ కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’(Bhaje Vaayu Vegam). యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ విడుదల చేయగా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా అలరించింది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
”ప్రతి ఒక్కడి లైఫ్ లో ఒకడుంటాడు. వాడి కోసం ఏం చేయడానికైనా మనం వెనుకాడం నా లైఫ్ లో అది మా నాన్న” అనే డైలాగ్స్‌తో ఈ టీజర్ సాగింది. ఇక టీజర్ గమనిస్తే.. తండ్రి కొడుకుల బాండింగ్‌తో ఈ సినిమా రానున్నట్లు అర్థం అవుతుంది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

