Bujji| టాలీవుడ్, పాన్ ఇండియా మూవీ లవర్స్‌తోపాటు గ్లోబల్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే ఠక్కున చెప్పే పేరు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas) లీడ్ రోల్లో నటిస్తు్న్నాడు. కాగా బుధవారం సాయంత్రం రామోజీఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్లో బుజ్జి, భైరవ ఎంట్రీ విజువల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ కల్కి 2898 ఏడీ అవతార్‌లో బుజ్జితో స్టేజ్‌పై చక్కర్లు కొట్టాడు. భైరవ (ప్రభాస్), కారు (Bujji) ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. బుజ్జి గ్లింప్స్‌ను చూసిన తర్వాత ఆనందంలో మునిగితేలుతున్నారు. ప్రభాస్‌ను సూపర్ హీరోగా, ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూడాలన్న కోరిక కల్కితో నెరవేరిందని అంటున్నారు. ఇంకా తిరుగనేదే లేదు.. లవ్ యూ బుజ్జి అని భైరవ అంటుంటే.. ఆ ఫర్వాలేదులే అంటోంది బుజ్జి.
భైరవ, బుజ్జి ఇద్దరు స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లో ఉన్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. బుజ్జికి కీర్తిసురేశ్ వాయిస్ పర్ఫెక్ట్గా సెటయిందంటున్నారు సినీ జనాలు. సినిమా కోసం విడి భాగాల నుంచి నాగ్ అశ్విన్ టీం ఇలా ప్రత్యేకంగా ఓ కారు తయారు చేయడం సినీ చరిత్రలోనే తొలిసారి అని ఇన్సైడ్ టాక్. కల్కి 2898 ఏడీలో భైవర, బుజ్జి టాలీవుడ్ హిస్టరీలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు మూవీ లవర్స్, ట్రేడ్ పండితులు.
ఈవెంట్‌కు భైరవ, బుజ్జి (కారు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సభా ప్రాంగణానికి బుజ్జిని ప్రత్యేక వాహనంలో తీసుకెళ్తున్న విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ మూవీని వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. బుజ్జితోపాటు కల్కి 2898 ఏడీ వీడియోలు యూట్యూబ్‌లో టాప్ 20 ప్లేస్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.
బుజ్జి, భైరవ క్రేజీ కాంబో విజువల్స్..
#Bujji and Bhairava
They are a pair for cinema History
– @nagashwin7 via Insta#Kalki2898AD #Prabhas pic.twitter.com/ELnZvaeGpQ
— Team PRABHAS (@TeamPrabhasOffl) May 23, 2024
The top two trending videos on Youtube belong to #Prabhas 🔥🔥🔥. More than four videos related to #Kalki2898AD/#Bujji are currently trending in the top 20 on youtube! 💥 pic.twitter.com/cVje8cDMJ8
— Hail Prabhas (@HailPrabhas007) May 23, 2024
#Prabhas entry at #Bujji event ✨💃🏻#Kalki2898AD pic.twitter.com/8nV1Ie0t10
— Siva Harsha (@SivaHarsha_23) May 22, 2024
BUJJI is Multi-lingual😱
The Chemistry between Bhairava & #Bujji will be treat to watch😍@KeerthyOfficial perfect choice for Bujji, its cute🫰
The Visuals, The Music, The Granduer – Truly International Stuff🤩 @nagashwin7🙇#Prabhas #KamalHaasan #AmitabhBachchan #Kalki2898AD pic.twitter.com/wKV09RoO69— Ayyo (@AyyoEdits) May 22, 2024
For the first time in the world #Kalki2898AD movie crew built a car completely from scratch just for a movie #Bujji#Prabhas 💥 pic.twitter.com/IXxjXzd1VY
— Kalki 2898AD FC (@Kalki2898AD_FC) May 23, 2024