Bhagyashree borse | టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన భాగ్యశ్రీ బొర్సే .. సినిమాల కంటే పెళ్లి రూమర్లే ఎక్కువ!
Bhagyashree borse | టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన ఆమెకీ అన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ క్రేజ్ మాత్రం ఆకాశాన్నంటుతోంది.
Bhagyashree borse | టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన ఆమెకీ అన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ క్రేజ్ మాత్రం ఆకాశాన్నంటుతోంది. అందం, స్టైల్, యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భాగ్యశ్రీ తాజాగా తన కెరీర్లో తొలి విజయాన్ని అందుకుని మళ్లీ స్పాట్లైట్లోకి వచ్చారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ మొదట బాలీవుడ్లో అడుగుపెట్టారు.తెలుగు ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసిన చిత్రం మిస్టర్ బచ్చన్. తొలి మూవీనే ఫ్లాప్ అయినా, ఆమె లుక్స్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
తర్వాత వచ్చిన కింగ్డమ్ కూడా నిరాశపరిచింది. తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన కాంతలో నటించిన ఆమె, లుక్స్‌కు మంచి ప్రశంసలు అందుకున్నా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేదు. అయితే మొదటి నుండి బాగానే కష్టపడిన సక్సెస్ రాలేదు. ఎట్టకేలకి ఇప్పుడు భాగ్యశ్రీకి మొదటి సక్సెస్ దక్కింది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఆంధ్రా కింగ్‌లో ఆమె మహాలక్ష్మి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. రెట్రో లుక్‌లో అచ్చం తెలుగమ్మాయిలా కనిపించిన భాగ్యశ్రీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా, రామ్‌తో ఆమె కెమిస్ట్రీ కూడా సినిమాకి పాజిటివ్‌గా మారింది.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో భాగ్యశ్రీ పెళ్లి గురించి అకస్మాత్తుగా చర్చ మొదలైంది. రామ్‌తో ఆమె రిలేషన్లో ఉన్నారన్న రూమర్స్ కొంతకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలో ఆంధ్రా కింగ్ ప్రమోషన్స్‌లో రామ్, భాగ్యశ్రీ స్పందించారు. మేము కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని స్పష్టంగా చెప్పినా రూమర్లు మాత్రం ఆగలేదు. అయితే కొందరు నెటిజన్స్ “ఇప్పుడే పెళ్లి ఎందుకు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడే కెరీర్ సెట్ అవుతున్న సమయంలో పెళ్లి చేస్తే ఇబ్బందులు రావచ్చు అని అంటున్నారు. అనవసర చర్చలు ఆపండి అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మొత్తం మీద అనేక రూమర్స్ నడుమ భాగ్యశ్రీ బొర్సే ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పెళ్లి గురించి వస్తున్న చర్చలు, రూమర్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆ ఉత్తర్వులు బీజేపీ కార్యకర్తలకు రోజ్‌గార్ గ్యారెంటీ’
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

