NBK108 Movie Title | బాలయ్య ప్రస్తుతం అనీల్ రావిపూడితో యాక్షన్ డ్రామా కలబోతతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చేసింది. అఖండ, వీరసింహా రెడ్డి వంటి వరుస విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. దానికి తోడు బాలయ్య లుక్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ఈ సినిమతో ఎలాగైనా హ్యా్ట్రిక్ సాధించలన్న కసితో బాలయ్య, ఎఫ్-3 వంటి ఘోర ఫ్లాప్ తర్వాత మాస్ కంబ్యాక్ ఇవ్వాలన్న కసితో అనీల్ రావిపూడి ఇద్దరూ ఉన్నారు. దసరాను టార్గెట్ చేసుకుని ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఫిక్సయినట్లు సమాచారం. ఐ డోంట్ కేర్ అనేది ఉపశీర్షిక. ఇప్పటికే ఈ పేరును చిత్రబృందం రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తుంది. బాలయ్య బర్త్‌డే సందర్భంగా జూన్ 10న టైటిల్‌ను రివీల్ చేయనున్నారు. ఇక అనీల్ రావిపూడి తొలిసారి అవుట్ అండ్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కూతురుగా కనిపించనుంది. ఫాదర్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.