NBK108 Movie | భగవంత్ కేసరీ టీజర్ కు టైమ్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Bhagavath Kesari Movie | నిన్న విడుదలైన భగవత్ కేసరి ఫస్ట్ లుక్ పోస్టర్ కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించడంతో నందమూరి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
Bhagavath Kesari Movie | నిన్న విడుదలైన భగవంత్ కేసరి ఫస్ట్ లుక్ పోస్టర్ కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించడంతో నందమూరి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దసరాను టార్గెట్ చేసుకుని పక్కా ప్లాన్ తో చిత్రబృందం షూటింగ్ జరుపుతుంది. ఇక శనివారం బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా టీజర్ టైమ్ కు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా టీజర్ లాంఛ్ ను శనివారం ఉదయం 10:19 గంటలకు 108 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 80 సెకండ్ల నిడివితో విడుదల కాబోతున్న ఈ టీజర్ మాస్ ఫీస్ట్ లా ఉంటుందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. ఈ మేరకు అనీల్ రావిపూడి, థమన్ కలిసి టీజర్ కు అన్ని సిద్దమైనట్లు పోస్టర్ ను విడుదల చేశారు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల బాలయ్యకు కూతురుగా కనిపించనుంది. బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Muhurtham Fix💥
Get Ready for the Mass Feast from#BhagavanthKesari 🔥
TEASER LAUNCH TOMORROW at 10:19 AM IST 🤩
In 108 Theatres Worldwide💥#NandamuriBalakrishna@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/qphCw181yC— Shine Screens (@Shine_Screens) June 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

