‘ఉడతా ఉడతా హుష్షా హుష్.. సప్పుడు సేయకుర్రీ.. నీ కన్నా మస్తుగ ఉరుకుతాంది మా సిట్టి సిన్నారీ..’. పాట అదిరింది కదూ. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాకోసం తెలంగాణ భాష, యాసలోని సోయగమంతా వినిపించేలా అనంతశ్రీరామ్ రాసిన పాట ఇది. తమన్ స్వరాలందించగా, యస్.పి.చరణ్ ఆలపించారు. ఈ పాటను బుధవారం విడుదల చేశారు.
చిత్రీకరణ చూస్తుంటే 34ఏళ్ల క్రితం బాలకృష్ణ ‘ముద్దులమావయ్య’ సినిమాలోని ‘మామయ్య అన్న పిలుపు.. మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు’ పాట గుర్తొస్తున్నది. కాకపోతే చిన్న మార్పు.. అక్కడ చెల్లెలు, ఇక్కడ కూతురు అంతే తేడా. బాలయ్య బాబాయిగా, శ్రీలీల కూతురుగా ఒదిగిపోయి నటించారీ పాటలో. ఈ పాటను బట్టి సినిమాలో ఎమోషన్స్‌కి కొదవుండదని అర్థమవుతున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానున్న విషయం తెలిసిందే.