Bhaag Saale Movie | కేసీఆర్‌కు తెలంగాణ ఎంతిష్టమో నువ్వంటే అంత ఇష్టం.. ఫుల్ ఎంటర్టైనింగ్గా భాగ్ సాలే ట్రైలర్
Bhaag Saale Movie Trailer | మత్తు వదలరా వంటి వనూత్న కథతో ఎంట్రీ ఇచ్చి తొలి అడుగులోనే సక్సెస్ అయ్యాడు శ్రీసింహ. యంగ్ టాలెంట్ అంతా కలిసి కష్టపడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ వర్షం కురిపించింది.
Bhaag Saale Movie Trailer | మత్తు వదలరా వంటి వనూత్న కథతో ఎంట్రీ ఇచ్చి తొలి అడుగులోనే సక్సెస్ అయ్యాడు శ్రీసింహ. యంగ్ టాలెంట్ అంతా కలిసి కష్టపడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించింది. ఆ తర్వాత అదే స్పీడ్‌తో తెల్లవారితే గురువారం అనే రోమ్ కామ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటికే ఎన్నో సార్లు చూసేసిన కథ కావడంతో ఈ సినిమాను జనాలు తిప్పికొట్టారు. కట్ చేస్తే రెండు వారాల్లోనే ఆహాలో సందడి చేసి అక్కడ కూడా మంచి వ్యూస్ రాబట్టలేకపోయింది. ఆ తర్వాత దొంగలున్నారు జాగ్రత్త వంటి సర్వైవల్ థ్రిల్లర్‌తో వచ్చి మరో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు.
ప్రస్తుతం శ్రీసింహ ఆశలన్నీ భాగ్ సాలే సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి బజ్నే క్రియేట్ చేసింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ట్రైలర్‌తోనే మేకర్స్ సినిమాపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సింహ ఒక మంచి చెఫ్. వంట వండితే ఎలాంటి వారైనా సరే మెచ్చుకుని తీరాల్సిందే. మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇతనికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి వాళ్ల నాన్నతో సింహ గురించి గొప్పగా, రాయల్ ఫ్యామిలీ అని పరిచయం చేస్తుంది. అలా సాఫీగా సాగిపోతున్న సింహ లైఫ్‌లోకి విలన్ ఎంటరవుతాడు.
డైమండ్ పొదిగి ఉన్న ఒక విలువైన రింగు కోసం ఎక్కడెక్కడో తిరిగి దానితో సింహ ఫ్యామిలీకి లింక్ ఉందని గుర్తించి విలన్ వీళ్ళ వెంటపడతాడు. మ్యాటర్ లేట్‌గా అర్థం చేసుకున్న అర్జున్ అక్కడి నుంచి ఫ్రెండ్స్‌తో కలిసి తప్పించుకునే రేస్ మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రింగ్ దొరికిందా? నిజంగానే సింహ ఫ్యామిలీకి రింగ్‌కు సంబంధం ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే జూలై 7న సినిమా చూడాల్సిందే. ట్రైలర్‌తోనే సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చారు. ‘పొద్దున్నే తిన్నోడు మధ్యాహ్నం తినక మానడు. మధ్యాహ్నం తిన్నోడు రాత్రి తినకమానడు ఇదెప్పుడు రన్నింగ్‌లో ఉండే బిజినెస్ నాన్న’, ‘కేసీఆర్‌కు తెలంగాణ ఎంతిష్టమో నువ్వంటే అంత ఇష్టం’. ‘క్వీన్ పోయి కింగ్ ఏడుస్తుంటే.. ఉంచుకొన్నదొచ్చి రింగ్ అడిగిందంట’ అనే డైలాగ్స్ సినిమా ఎంత కామెడీ వేలో సాగుతుందోనని స్పష్టం చేశాయి.
అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించాడు. సింహకు జోడీగా నేహ సోలంకి నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. బిగ్ బెన్ సినిమా, సినీ వాల్లే మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

