శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం జూలై 7న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ “భాగ్ సాలే’ అనే సౌండింగ్లోనే ఓ ఫన్ క్రియేట్ అవుతుంది. ఇది పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో నడిచే కథ. సికింద్రాబాద్, వారాసిగూడ, పాతబస్తీలో చిత్రీకరణ జరిపాం’ అన్నారు. ఈ సినిమాలో అర్జున్ అనే ఓ టక్కరి దొంగ పాత్రలో కనిపిస్తానని, ఓ విలువైన ఉంగరం దొరకడం వల్ల అతని జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయనేది ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని శ్రీసింహా కోడూరి తెలిపారు. నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ ‘క్రైమ్ కామెడీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన జోనర్. హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్లో చక్కటి వినోదంతో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది’ అన్నారు.