Vijay Devarakonda | బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన నటుడు విజయ్ దేవరకొండ
Vijay Devarakonda | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ కేసులో నేడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు.
Vijay Devarakonda | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ కేసులో నేడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాశ్ రాజ్‌తో పాటు పలువురు నటులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో గత నెల 30న ప్రకాశ్ రాజ్ హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే నేడు విచారణకు రావాలని విజయ్‌కి నోటీసులు జారీ చేయగా.. తాజాగా అతడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు.
తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే హీరోలు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, నటి మంచు లక్ష్మి వంటి వారికి కూడా ఈడీ నోటీసులు పంపింది. రానా దగ్గుబాటి ఇప్పటికే విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. సినిమా షూటింగ్‌లు ఉండడంతో విచారణకు మరికొంత సమయం కోరాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

