Bellamkonda Sai Srinivas | ఛత్రపతి వంటి భారీ డిజాస్టర్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం టైసన్ నాయుడు. భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. 14 రీల్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రామ్ ఆచంట – గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నేడు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టైసన్ నాయుడు నుంచి టైటిల్‌తో పాటు.. ఫస్ట్ లుక్, ఫస్టు గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ చూస్తే.. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే సీరియస్ పోలీస్ పాత్రలో బెల్లంకొండ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. మరోవైపు బెల్లంకొండ ముచ్చటగా మూడో సారి ఖాకీ చొక్కా తొడుక్కోబోతున్నాడు. గతంలో కవచం, రాక్షసుడు సినిమాలలో పోలీస్ రోల్స్ చేయగా.. కవచం కమర్షియల్ ఫేయిల్యూర్ గా మిగిలింది.. రాక్షసుడు హిట్టయింది. ఇక ఇప్పుడు మూడో సారి పోలీస్ కథతో వస్తున్నాడు.