Swathi Mutyam Movie | ‘స్వాతిముత్యం’ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్.. !
Swathi Mutyam Second Single Release | టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో బెల్లంకొండ సురేష్ బాబు ఒకడు. ఈయన ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈయన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శ్రీను’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన బాలీవుడ్లో ‘ఛత్రపతి’ రీమేక్ చేస్తున్నాడు. కాగా శ్రీనివాస్ తమ్ముడు గణేష్ ‘స్వాతి ముత్యం’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాలతో విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది. అయితే మేకర్స్ ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని ‘డుమ్ డుమ్ డుమ్’ అంటూ సాగే పెళ్ళి పాటను విడుదల చేశారు. మహతి సాగర్ స్వర పరిచిన ఈ పాట మ్యారేజ్ వైబ్స్‌ను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు, ‘నీ చారేడు కళ్లే’ పాటకు ప్రేక్షకులను నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో గణేష్‌కు జోడీగా ‘మిడిక్లాస్ మెలోడీస్’ ఫేం వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది. సీతార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

