Swathimuthyam Movie | ‘స్వాతిముత్యం’ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. ఆకట్టుకుంటున్న వర్ష బొల్లమ్మ డైలాగ్!
Swathimuthyam First Single | టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో బెల్లంకొండ సురేష్ ఒకడు. ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఈయన పెద్ద కొడుకు శ్రీనివాస్ బెల్లంకొండ హీరోగా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్ హిందీలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి వివి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే సురేష్ చిన్న కొడుకు, శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేష్ ‘స్వాతి ముత్యం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
‘నీ చారెడు కళ్ళే’ అంటూ సాగే మెలోడియస్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో ‘నేను కాల్ లిఫ్ట్ చేయక పోతే పక్కనే ఎవరో ఉన్నట్టు.. కాల్ చేస్తే నేను హలో అనే వరకు నువ్ హలో అనకు’ అంటూ వర్షా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ జూన్ 27న విడుదల కానుంది. మహాతి స్వర సాగర్ స్వర పరిచిన ఈ పాటను ఆర్మాన్ మాలిక్ ఆలపించాడు. కేకే సాహిత్యం అందించాడు. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేం వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది.
Here's the beautiful #NeeChaareduKalle song promo from #Swathimuthyam 💕
Full song out on 27th June 😍
🎤@ArmaanMalik22 @SanjanaKalmanje
✍️@kk_lyricist
🎹@mahathi_sagar #Ganesh @VarshaBollamma @Lakshmankkrish2 @dopSURYAA @vamsi84 @adityamusic— Sithara Entertainments (@SitharaEnts) June 25, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

