ఐఫోన్ కోసం తంటాలు
బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘నేను స్టూడెంట్ సార్'. అవంతిక దస్సాని కథానాయిక. ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. జూన్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘24/7 ఒకటే ధ్యాస...’
బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘నేను స్టూడెంట్ సార్’. అవంతిక దస్సాని కథానాయిక. ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. జూన్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘24/7 ఒకటే ధ్యాస…’ అనే పాటను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘గణేష్, నేను మంచి మిత్రులం. తరుచూ డ్యాన్స్, జిమ్ క్లాసుల్లో కలుస్తుంటాం. ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది. గణేష్ మంచి కథలతో సినిమాలు చేస్తున్నాడు. సినిమా రంగంలో రోజూ స్టూడెంట్‌నని భావిస్తుంటా’ అని చెప్పారు. హీరో గణేష్ బెల్లంకొండ మాట్లాడుతూ…‘ఫోన్ కొనేందుకు కష్టపడుతుండగా వచ్చే మాంటేజ్ సాంగ్ ఇది.
కథను ముందుకు తీసుకువెళ్తుంది. ఈ పాట చూస్తున్నప్పుడు మీకు సహజమైన అనుభూతి కలగాలని కష్టపడి చేశాం. ఆ ఫీల్ మీకు చేరిందని ఆశిస్తున్నా’ అన్నారు. నిర్మాత సతీష్ వర్మ మాట్లాడుతూ…‘మా చిత్రాన్ని ఇంతకంటే ముందే విడుదల చేయాల్సింది. పరీక్షలు జరుగుతున్నాయని ఆగాం. హీరో క్యారెక్టర్ ఏంటో ఈ పాట ద్వారా ప్రేక్షకులకు తెలుస్తుంది’ అన్నారు. కథా రచయిత కృష్ణ చైతన్య మాట్లాడుతూ…‘కాలేజ్ లైఫ్‌లో లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ భావజాలాలు ఉంటాయి. కానీ జీవితంలోకి వచ్చేసరికి డబ్బు ఒకటే నిత్యావసరం అని తెలుస్తుంది. ఈ అంశమే ఈ కథకు నేపథ్యం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

