Alia Bhatt | ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుంది.. అలియా భట్ ఎమోషనల్ పోస్ట్
Alia Bhatt | భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
Alia Bhatt Shares Heartfelt Post | భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
అలియా రాసుకోస్తూ.. గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్తా వెనుక, ప్రతి భోజన బల్ల చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. ఎక్కడో పర్వతాలలో మన సైనికులు మేల్కొని, దేశకోసం మనకోసం యుద్ధం చేస్తున్నారనే అనే బరువును మనం అనుభవించాం అంటూ అలియా అన్నారు.
మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్లో ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుస్తుందని తెలిపింది.
ఇటీవలే జరిగిన మాతృ దినోత్సవం గురించి అలియా స్పందిస్తూ.. పూలు పంచుకుంటూ, ఆప్యాయంగా పలుకరించుకుంటున్న వేళ, దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులను కని పెంచిన తల్లుల గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను. ప్రాణాలు కోల్పోయిన వారిని, ఇక ఎన్నటికీ ఇంటికి రాని సైనికులను, ఇప్పుడు ఈ దేశ హృదయంలో శాశ్వతంగా చెక్కిన వారి పేర్లను మనం తలుచుకుని దుఃఖిస్తున్నాము. వారి కుటుంబాలకు దేశం యొక్క కృతజ్ఞతలో శక్తి లభించాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు.
ఈ రాత్రి నుంచి ఉద్రిక్తతతో కూడిన నిశ్శబ్దం తక్కువగా ఉండాలని, శాంతి నుండి పుట్టిన నిశ్శబ్దం ఎక్కువగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లను దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాము. ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మనం కలిసి నిలబడదాం. మన రక్షకుల కోసం. భారతదేశం కోసం. జై హింద్ అంటూ అలియా రాసుకోచ్చారు.
దేశంలో నెలకొన్న పరిస్థితులపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్న తరుణంలో, అలియా భట్ చేసిన ఈ భావోద్వేగపూరితమైన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. పహల్గామ్ దాడి నుండి ఇండియా-పాక్ ఘర్షణ మరియు కాల్పుల విరమణ వరకు పలు అంశాలపై బి-టౌన్ ప్రముఖులు తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నారు. మన సాయుధ దళాల కోసం అలియా చేసిన ఈ సూటి మరియు హృదయపూర్వకమైన సందేశం విశేషంగా నిలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

