తోటి కథానాయికను మెచ్చుకోవడం, పొగడటం హీరోయిన్లలో అరుదుగా చూస్తుంటాం. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీలీలని తెగ మెచ్చుకుంది కాజల్. ‘ శ్రీలీలను చూస్తుంటే కొన్నేళ్ల క్రితం నన్ను నేను చూస్తున్నట్టుంది. పాత్రపై తను దృష్టిపెట్టే విధానం నిజంగా సూపర్. తన కాంబినేషన్లో చేస్తున్నప్పుడు గ్రహించాను.
తను క్యారెక్టర్ నుంచి తేలిగ్గా బయటకు రాదు. కాసేపు అదే ట్రాన్స్‌లో ఉండిపోతుంది. అది మంచి నటికి ఉండే లక్షణం. కొన్ని పాత్రల విషయంలో నేనూ అలాగే ఉండిపోయేదాన్ని. పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న పాత్రలు ప్రతిసారీ దొరకవు. అలాంటి పాత్రలు ఎన్ని దొరికితే నటిగా అంత షైన్ కావొచ్చు. శ్రీలీలకు ‘భగవంత్‌కేసరి’లో దొరికిన పాత్ర అలాంటిదే. ఇందులో నా పాత్ర కూడా బాగుంటుంది. కాత్యాయని అనే సైకియాట్రిస్ట్‌గా కనిపిస్తా’ అని చెప్పుకొచ్చింది కాజల్.