Beast Movie | తమిళ స్టార్ విజయ్ థలపతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘తుపాకీ’ చిత్రంతో విజయ్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. తమిళంతో పాటు తెలుగులోను ఈయన చిత్రాలు ఏకకాలంలో విడుదలవుతుంటాయి. గతేడాది వచ్చిన ‘మాస్టర్’ చిత్రం 14కోట్ల కలెక్షన్లను సాధించి తెలుగులో విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను నిరూపించింది. ఈయన లేటెస్ట్గా నటించిన చిత్రం బీస్ట్. డాక్టర్ ఫేం నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విడుదలకు సిద్దంగా ఉంది. తాజాగా ఈ చిత్ర తెలుగు పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకులలో మంచి అంచానాలే ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటులు సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. ఇప్పటికే అరబిక్ కుత్తూ పాట 220 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది. అనురుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిథి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం ఐదు భాషల్లో పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 13న విడుదల కానుంది.
#பீஸ்ட் #బీస్ట్ #ബീസ്റ്റ് #ಬೀಸ್ಟ್ #रॉ
From April 13th 🔥#Beast Releasing in 5 Language 😎pic.twitter.com/nLU1a0eOut— Vijay Fans Trends (@VijayFansTrends) March 26, 2022