యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న బీస్ట్.. అరబిక్ పాటకు మిలియన్ల వ్యూస్..
Beast movie | తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
Beast movie | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను సాధించాయి. గతేడాది ఈయన నటించిన మాస్టర్ చిత్రం కరోనా సమయంలో విడుదలైనా తెలుగు రాష్ట్రాల్లో 14కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఈయన నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్ మూవీలో నటించాడు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మెలోడి పాట ప్రోమోను మంగళవారం విడుదల చేశారు.
ఈ ప్రోమో 6 నిమిషాల నిడివి ఉండగా.. పాట మాత్రం కేవలం 4 నిమిషాలే ఉండనుందట. ప్రోమోకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాటను స్టార్ హీరో శివకార్తికేయన్ రచించాడు. అరబిక్ గెటప్‌లో అనిరుధ్, నెల్సన్ కుమార్, శివకార్తికేయన్లు కలిసి చేసిన ఈ ప్రోమో యూట్యూబ్‌లో 10 మిలియన్ల వ్యూస్‌తో పాటు 10 లక్షల లైక్స్‌ను సాధించింది. ఇంత వేగంగా కోటిగా పైగా వ్యూస్‌ను సాధించిన ప్రోమోగా ఇది రికార్డ్ సృష్టించింది. ఈ అరబిక్ మెలోడి గీతాన్ని ప్రేమికులరోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. బీస్ట్ చిత్రాన్ని ఎప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.
10 Million views & 1 million likes for #Beast 1st single promo. #ArabicKuthu@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @Siva_Kartikeyan @hegdepooja #ArabicKuthuOnFeb14 #BeastFirstSingle
— Vamsi Kaka (@vamsikaka) February 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

