Kisi ka Bhai Kisi ki Jaan Movie | సల్మాన్ ఖాన్ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్ రిలీజ్
Bathukamma Song | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత రెండేళ్లుగా సల్మాన్‌ను వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ పైనే ఉన్నాయి.
Bathukamma Song | దశాబ్ధాలుగా బాలీవుడ్ ఇండస్ట్రీని రారాజులా ఏలుతున్న సల్మాన్‌ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి గతేడాది సల్మాన్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ ముందటి ఏడాది రెండు సినిమాలు విడుదల కాగా.. రెండూ నిర్మాతలకు తేరుకోని నష్టాల్ని మిగిల్చాయి. దాంతో సల్మాన్ కొంచెం గ్యాప్ తీసుకుని రెండు సినిమాలతో అభిమానులలో ఉత్సాహం నింపడానికి రెడీ అయ్యాడు. సల్మాన్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్‌మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ ఒకటి. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా వెంకీ కీలకపాత్ర పోషించనుండటంతో తెలుగులోనూ విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్‌ను రిలీజ్ చేసింది. లేటెస్ట్గా విడుదలైన ఈ పాట శ్రోతలను తెగు ఆకట్టుకుంటుంది. కేవలం తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేశారా? లేదంటే హిందీలోనూ తెలుగు సాహిత్యమే ఉంటుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పాటలో బతుకమ్మ పండుగ ఉట్టిపడేట్టు కనిపిస్తుంది. భూమిక, పూజా హెగ్డే దాండియా స్టెప్స్ అదిరిపోయాయి. పాట చివర్లో సల్మాన్ పంచలో దర్శనమివ్వడం పాటకే హైలేట్‌గా నిలిచింది.

ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వీరమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్బింగ్ అయింది. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి ప్రసాద్, రవి బస్రూర్, హిమేశ్ రేషమ్మియా సంగీత దర్శలుగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

