Pawan: పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే వార్త చెప్పిన బండ్ల..ఇక ఆ రోజు సందడే సందడి..!

పవన్ కళ్యాణ్‌కి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా అభిమానులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పవన్‌ని అభిమాని కన్నా ఎక్కువగా పూజిస్తూ, ఆరాధిస్తుంటాడు బండ్ల గణేష్.ఇటీవల ఆయనకు దేవర అని పేరు పెట్టుకున్నాడు . నిత్యం సోషల్ మీడియాలో పవన్‌కి సంబంధించిన ఏదో అప్డేట్ ఇస్తూ ఉండే బండ్ల గణేష్ సెప్టెంబర్ 2న పవన్ అభిమానులకి కిక్కిచ్చే వార్త చెప్పాడు.
పవన్ – బండ్ల గణేష్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దబాంగ్ సినిమాకు రిమేక్ అయినా.. కానీ పవన్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. థియేటర్లలో కాసుల వర్షం కురిపించాడు. ఈ సినిమాతోనే బండ్ల గణేష్ బడానిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ రెండో తారీకున బాస్ బర్త్ డే స్పెషల్ గా గబ్బర్ సింగ్ సినిమా చూడండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 షోలు వేస్తున్నాను, మనం మన బాస్ పుట్టినరోజు థియేటర్లో జరుపుకుందాం, జై పవర్ స్టార్, జై దేవర అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ అభిమానులు మా ఊరిలో కూడా ప్రదర్శించండి అని గణేష్‌కి వరుస ట్వీట్స్ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. దయచేసి మీరందరూ మీ ఊర్లో థియేటర్ బుక్ చేసుకొండి. షోకి నేను పర్మిషన్ ఇస్తాను అంటూ ట్వీట్ చేశారు. త్వరలో పవన్- బండ్ల గణేష్ కాంబినేషన్లో మరో సినిమా రూపోందనుందని టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- gabbar singh
- Pawan Kalyan
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

