Bandla Ganesh |టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆయన కుమార్తె జనని త్వరలోనే చిలుకూరి సూర్య తేజతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల ఈ జంట నిశ్చితార్థ వేడుక ఘనంగా జరగగా, సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక మరింత వైభవంగా నిలిచింది. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వేడుకకు హాజరైన అతిథులందరికీ బండ్ల గణేష్ ఖరీదైన రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఒక అతిథి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, అతిథులకు ఆస్ట్రియా బ్రాండ్ బర్గనర్ కి చెందిన బిర్యానీ హండి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ గిఫ్ట్ బాక్స్‌లో ఒక స్వీట్ బాక్స్, బ్లౌజ్ పీస్తో పాటు దాదాపు 5 కిలోల సామర్థ్యం గల హండి ఉందని తెలుస్తోంది. ఈ కిచెన్ వేర్ విలువ సుమారు రూ.5,000 వరకు ఉంటుందని సమాచారం.
ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. “ఎంగేజ్మెంట్కే ఇంత రేంజ్లో గిఫ్ట్స్ ఇస్తే, పెళ్లికి ఇంకేం ఇవ్వబోతున్నారు?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పెళ్లి వేడుక ఎంత గ్రాండ్‌గా జరగబోతోందో అని చర్చిస్తున్నారు. ఇక వరుడు సూర్య తేజ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్లు సమాచారం. అతనికి కూడా కోట్లలో ఆస్తులు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన వ్యక్తిగత జీవితం, వృత్తి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బండ్ల గణేష్ కుటుంబంలో జరుగుతున్న ఈ వివాహ వేడుక టాలీవుడ్లో మరో గ్రాండ్ ఈవెంట్‌గా నిలవనుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.