బొద్దుగా ఉంటేనే ఇష్టం

బొద్దుగా ఉండే కథానాయికల్ని దక్షిణాది ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతారని అంటోంది అవికాగోర్. హీరోయిన్లు లావుగా ఉండటమనేది సౌత్ ఇండస్ట్రీలో సమస్య కాదని చెబుతోంది.ఇదివరకు బొద్దుగా ఉండే అవికా గోర్ ఇటీవలే బరువు తగ్గి నాజూకుగా తయారైంది. సినిమా అవకాశాలు తగ్గడంతోనే ఆమె సన్నబడిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై అవికాగోర్ స్పందిస్తూ ‘జీరోసైజ్ ట్రెండ్‌కు దక్షిణాదిలో ఆదరణ తక్కువే. కథానాయికలు బొద్దుగా కనిపించాలనే ఇక్కడి ప్రేక్షకులు కోరుకుంటారు. అలాంటి వారినే ఇష్టపడుతుంటారు. అందువల్లే బరువు ఎక్కువ ఉండటం సమస్యగా నేను ఎప్పుడూ భావించలేదు. బొద్దుగా ఉండటం వల్ల సినిమా అవకాశాల్ని కోల్పోయననేది అవాస్తవం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే సన్నబడ్డాను. అంతేకానీ సినిమా ఆఫర్ల కోసం కాదు. బరువు తగ్గడానికి కాస్మోటిక్ సర్జరీలు, అనారోగ్యకరమైన డైట్‌ను ఫాలో అవ్వలేదు. నచ్చినవి తింటూనే వర్కవుట్స్ ద్వారా సన్నబడ్డా’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- avika gor
- Balika Vadhu
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

