త్వరలో అమిగోస్ (Amigos) సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam). అమిగోస్ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశాడు కల్యాణ్ రామ్. ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేశాడు.
మేకప్ రూంలో ఉన్న కల్యాణ్ రామ్‌కు ఓ అభిమాని ఫోన్ చేస్తాడు. అభిమాని బింబిసార సూపర్ న్నా అంటుండగా.. వచ్చే నెల 10వ తేదీన అమిగోస్ విడుదలవుతుంది అని చెబుతాడు కల్యాణ్ రామ్. ఇంతకీ అమిగోస్ ఏంటని అడిగితే.. స్పానిష్‌లో ఫ్రెండ్స్ అని అర్థం. ఈ సినిమాలో ముగ్గురు (doppelgangers) మనిషిని పోలిన మనుషులుంటారు. ఆ ముగ్గురు ఎలా కలిశారు. వాళ్ల మధ్య ఎలా స్నేహం ఏర్పడింది. వాళ్ల మధ్య ఏం జరిగింది..అనే అంశాల చుట్టూ సినిమా తిరుగుతూ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటున్నాడు కల్యాణ్‌రామ్.
అంతేకాదు ఫ్యాన్స్ కోసం బాలకృష్ణ ఆల్బమ్‌లోని సూపర్ హిట్సాంగ్ రీమేక్ చేయబోతున్నామని.. అదేంటో ఊహించండి అని ముగించాడు కల్యాణ్‌రామ్. కల్యాణ్ రామ్ చెప్పిన ప్రకారం ధర్మక్షేత్రం సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి..కానీ పాటను అమిగోస్ లో రీమేక్ చేయబోతున్నట్టు అర్థమవుతుంది.
కల్యాణ్ రామ్ చిట్ చాట్ సాగిందిలా..
అమిగోస్ టీజర్..
యెక యెక వీడియో సాంగ్..