balakrisha pic leaked | నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ విజయంతో జోరు మీదున్నాడు. ఇక అదే స్పీడ్‌లో వరుసగా సినిమాలను కూడా ఓకే చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనీ దర్శకత్వంలో అవుడ్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ను చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యుల్ షూటింగ్ శుక్రవారం ప్రారంభంమైంది. ప్రస్తుతం ఈ చిత్రం సిరిసిల్లలో మొదటి షెడ్యుల్‌ను జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుండి బాలకృష్ణ ఫోటో లీక్ అయింది.
లీకైన ఫోటోను గమనిస్తే సినిమాలోని ఓ సీన్‌ను చిత్రీకరిస్తున్నప్పుడు తీసిన ఫోటో అనిపిస్తుంది. బాలకృష్ణ గడ్డంతో రగ్గుడ్ లుక్‌తో మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇందులో సాహో ఫేం లాల్ బాలయ్య పక్కన నిల్చున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.