‘దాదా’ కోసం హుషారైన గీతం
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘దాదా’. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘దాదా’. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఈ సినిమాలోని తొలి పాట ‘దాదా ధమాకా’ను మేకర్స్ విడుదల చేశారు. పబ్ నేపథ్యంలో సాగే ఈ పాటలో బాలకృష్ణ, నర్గీస్ ఫక్రీ ఫుల్ ఎనర్జీతో కనిపించారు.
‘బావలే బావలే బావలే.. ఇక్కడున్నోళ్లంత నాకు సొంత బావలే..’ అంటూ రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను రజనిశ్రీ పూర్ణిమ ఆలపించారు. ఈ పాటలోని కొంత భాగాన్ని బాలకృష్ణ స్వయంగా పాడటం విశేషం. మాస్ బీట్తో, క్యాచీ రిథమ్స్‌తో ఫుల్ ఎనర్జిటిక్‌గా తమన్ ఈ పాటను స్వరపరిచారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతుల్ని సమకూర్చారు. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా ఈ పాట సాగింది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలకపాత్రధారి. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: అరవింద్ ఎస్ కశ్యప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

