Daaku Maharaaj | ఇక దబిడి దిబిడే.. జనవరి 12న డాకు మహారాజ్
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్'. బాబీ కొల్లి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Daaku Maharaaj | బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. బుధవారం ‘దబిడి దిబిడే..’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేశారు. బాలకృష్ణ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘దబిడి దిబిడే’ పేరుతో ఈ పాటను రూపొందించారు.
తమన్ సంగీతాన్నందించిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించారు. వాగ్దేవి ఆలపించింది. ఈ పాటలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా నృత్యాలు ప్రధానాకర్షణగా నిలిచాయి. కొరియోగ్రాఫర్ శేఖర్ వీజే చక్కటి నృత్యరీతుల్ని సమకూర్చారు. అదిరిపోయే మాస్ స్టెప్పులతో ఈ పాట హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్, సంగీతం: తమన్, దర్శకత్వం: బాబీ కొల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

