Bala Krishna | బాలయ్య సినిమా నుండి నయనతార ఔట్ .. ‘NBK 111’లో కాజల్ ఎంట్రీకి రంగం సిద్ధం?
Bala Krishna | నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్లో గోల్డెన్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ , వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో ఆయన స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలను లైన్లో పెట్టడం బాలయ్య ప్రత్యేకతగా మారింది.
Bala Krishna | నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్లో గోల్డెన్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ , వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో ఆయన స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలను లైన్లో పెట్టడం బాలయ్య ప్రత్యేకతగా మారింది. ఇలాంటి సమయంలోనే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ మరోసారి జతకట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “వీరసింహారెడ్డి” భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో “NBK 111” పేరుతో మరో ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.
ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. 1960-70ల కాలంలోని ముంబై నేపథ్యంతో పాటు చారిత్రక అంశాలను మేళవిస్తూ దర్శకుడు పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ మరోసారి బాలయ్య సినిమాకు సంగీతం అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే స్క్రిప్ట్ మార్పులు, కాల్షీట్ సమస్యల కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో ఆమె స్థానంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య-కాజల్ కాంబినేషన్లో వచ్చిన “భగవంత్ కేసరి” బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో, అదే సెంటిమెంట్‌ను కొనసాగించాలని చిత్రబృందం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కాజల్‌కు కథ చెప్పగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం “NBK 111” షూటింగ్ వేగంగా సాగుతోంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న యూనిట్, రెండో షెడ్యూల్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా ముంబై సెట్టింగ్స్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా రూపొందుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని 2026 ప్రథమార్ధంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “కురుక్షేత్రం” అనే మరో ఆసక్తికర ప్రాజెక్ట్ చేయబోతున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

