Bala Krishna | మరో మాస్ కాంబోకి సిద్ధమైన బాలయ్య ..మలయాళ దర్శకుడితో భారీ సినిమా
Bala Krishna | నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అంటే పవర్ఫుల్ పాత్రలు, మాస్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహరాజ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకున్న బాలయ్య… ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ విషయంలో మాత్రం అభిమానులను కొంత నిరాశపరిచారనే టాక్ వినిపించింది
Bala Krishna | నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అంటే పవర్ఫుల్ పాత్రలు, మాస్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహరాజ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకున్న బాలయ్య… ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ విషయంలో మాత్రం అభిమానులను కొంత నిరాశపరిచారనే టాక్ వినిపించింది. కథ పరంగా అంచనాలు అందుకోలేకపోయినా, ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్ దాటి బాలకృష్ణ స్టార్ పవర్ మరోసారి నిరూపించుకుంది.
ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం… ఈ ప్రాజెక్ట్‌కు మొదట అనుకున్న కథను పక్కనపెట్టి, మరింత పవర్ఫుల్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన కొత్త కథతో ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్ సీన్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని తెలుస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్లో మరో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన స్టైలిష్ యాక్షన్ దర్శకుడు హనీఫ్ అడెనితో బాలకృష్ణ ఓ భారీ చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.
ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా… ఈ కాంబినేషన్ వార్తలతోనే బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హనీఫ్ అడెని పేరు వినగానే స్టైలిష్ యాక్షన్, రా ఎనర్జీ, ఇంటెన్స్ విజువల్స్ గుర్తుకొస్తాయి. ఆయన సినిమాల్లో కథకన్నా ప్రెజెంటేషన్, స్క్రీన్‌పై కనిపించే ఎమోషనల్ హై మరియు యాక్షన్ ఇంపాక్ట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇటీవల విడుదలైన ‘మార్కో’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హనీఫ్… హింసాత్మక సన్నివేశాలపై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, టార్గెటెడ్ మాస్ ఆడియెన్స్‌ను బాగా మెప్పించారు. ఇలాంటి టేకింగ్ స్టైల్ బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు మరింత బలాన్నిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

