ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా సీనియర్ హీరో బాలకృష్ణ కాలికి గాయంతో ఆసుపత్రికి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల అఖండ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య.. ఆహాలో ప్రసారం కానున్న టాక్ షో కోసం నిన్న అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ప్రోమో షూటింగ్లో పాల్గొన్నారట. అయితే ప్రోమో షూట్‌కి సంబంధించిన సమయంలో బాలయ్య కాలుకి చిన్న గాయం అయిందట.
ఈ గాయాన్నిలెక్క చేయకుండా బాలకృష్ణ షూటింగ్లో పాల్గొన్నాడని, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. షూట్ పూర్తయ్యాక ఆయన కాలికి చికిత్స చేసుకున్నారట. మరి కొద్ది రోజులలో బాలయ్య టాక్ షోకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది. ఈ షోకి అన్‌స్టాపబుల్ అనే టైటిల్ పరిశీలిస్తుండగా, తొలి ఎపిసోడ్లో మంచు ఫ్యామిలీ హాజరు కానున్నట్టు సమాచారం.
ఇక బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ” విషయానికి వస్తే ఇందులో అఘోరాగా కనిపించనున్నాడు బాలయ్య. ఇప్పటికే ఆ లుక్ కు సంబంధించి విడుదలైన టీజర్ రికార్డులు క్రియేట్ చేసింది. దీపావళి కానుకగా సినిమా రిలీజ్ కానుందని అంటున్నారు.