సస్పెన్స్ థ్రిల్లర్ ‘బహుముఖం’
స్వీయ దర్శకనిర్మాణంలో హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్' ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం దర్శకుడు శశి కిరణ్ తిక్క ఆవిష్కరించారు. హీరోలోని భిన్న కోణాల్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.
స్వీయ దర్శకనిర్మాణంలో హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్’ ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం దర్శకుడు శశి కిరణ్ తిక్క ఆవిష్కరించారు. హీరోలోని భిన్న కోణాల్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. కౌన్సిలింగ్ సెషన్లో భాగంగా హీరో సైకో థెరపిస్ట్ దిశను కలవడం, తన కలను నెరవేర్చుకోవడానికి ఆమె సహాయాన్ని కోరడం, తన చుట్టూ వున్న వ్యక్తుల తాలూకు కొన్ని సీక్రెట్స్ తనకు తెలుసునని చెప్పడం ఆసక్తిని పెంచింది.
హీరో, దర్శకుడు హర్షివ్ కార్తిక్ మాట్లాడుతూ ‘ఆమెరికాలో తీసిన పక్కా తెలుగు సినిమా ఇది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆనూహ్య మలుపులతో సాగుతుంది. చిరంజీవి స్ఫూర్తిగా సినీ రంగంలోకి వచ్చాను. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ల్యూక్ ఫ్లెచర్, సంగీతం: ఫణి కల్యాణ్, రచన, నిర్మాణం, దర్శకత్వం: హర్షివ్ కార్తీక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

