Bahubali Movie@8 Years | అప్పటివరకు తెలుగు సినిమాలంటే పక్క రాష్ట్రాలు సైతం చిన్న చూపు చూసేవి. ఇక ఉత్తరాదిన తెలుగు సినిమా గురించి ఎన్నో సందర్భాల్లో తక్కువ చేసి మాట్లాడిన వారున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా చిరునే ఓ వేడుకలో తెలిపాడు. అయితే ఇదంతా ఎనిమిదేళ్ల కిందటి ముచ్చట. బాహుబలితో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. తెలుగు వారి ప్రతిభను, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యం అప్పట్లో సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పుట్లో ఒక సినిమా వంద కోట్లు వసూల్ చేసిందంటేనే ఆహో ఓహో అనుకున్నాం. కానీ రాజమౌళి ఈ సినిమాతో ఏకంగా ఆరొందల కోట్ల నెంబర్‌ను చూపించి టాలీవుడ్ సినిమాను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టాడు.
రాజంటే ప్రభాస్‌లానే ఉంటాడేమో అన్న రేంజ్లో రాజమౌళి, ప్రభాస్ క్యారెక్టర్‌ను అద్భుతంగా సృష్టించాడు. అంతే అద్భుతంగా ప్రభాస్ నటించాడు. భల్లాళదేవుడిగా రానాను ఎవరు రీప్లేస్ చేయలేరు అనిపించింది. శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప ఎవ్వరిని ఊహించుకోలేనంతగా తన నటనతో కట్టిపడేసింది. కట్టప్పగా సత్యరాజ్, దేవసేనగా అనుష్క, బిజ్జల దేవుడిగా నాజర్, అవంతికగా తమన్నా.. ఇలా ఎవరి పాత్రకు వాళ్లు తమదైన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. ఇక పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి కీరవాణి తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఈ సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వారిని నిజంగా అభినందించాలి. వంద కోట్లు వసూళ్ చేయడమే గగనం అనుకున్న సమయంలో ఏకంగా నూటా యాభై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమా తీశారంటే వాళ్ల గట్స్‌ను మెచ్చుకోవాలి. కాగా సోమవారంతో ఈ సినిమా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూద్ధాం.
నైజాం : 43.40 కోట్లు
సీడెడ్ : 21.70 కోట్లు
వైజాగ్ : 9.70 కోట్లు
ఈస్ట్ : 9.45 కోట్లు
వెస్ట్ : 7.80 కోట్లు
కృష్ణా : 6.80 కోట్లు
గుంటూరు : 10.25 కోట్లు
నెల్లూరు : 4.65 కోట్లు
ఏపీ + తెలంగాణ : 113.75కోట్లు
కర్ణాటక : 39.5 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 60.45 కోట్లు
తమిళనాడు : 35.5 కోట్లు
మలయాళం : 5.25 కోట్లు
ఓవర్సీస్ : 47.85 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 302.3 కోట్లు
బాహుబలి ది బిగినింగ్ సినిమాకు రూ.148 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ సినిమా రూ.302.3కోట్ల షేర్‌ను కొల్లగొట్టింది. ఈ లెక్కన బిజినెస్‌కు డబుల్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాను కోన్న బయ్యర్లు కళ్లు చేదిరే లాభాలు చూశారు. ఇక ఈ సినిమా వల్లే ఎన్నో పాన్ ఇండియా సినిమాలకు బీజం పడింది. ఆ తర్వాత రెండేళ్లకు విడుదలైన సీక్వెల్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.