Kamal Haasan | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రాజెక్ట్ K (Project k) పై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ జోనర్లో మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ప్రభాస్ లుక్ విడుదల చేయగా.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్ కాన్ (San Diego Comic-Con (SDCC)) ఈవెంట్ లో రీలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే శాన్ డియాగోలో ఏర్పాటు చేసిన హాలీవుడ్ మీడియా పార్టీలో ప్రభాస్‌తోపాటు లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan), డైరెక్టర్ నాగ్ అశ్విన్, రానా దగ్గుబాటి చిల్ అయ్యారు. బాహుబలి స్టార్ యాక్టర్లు ప్రభాస్, రానా కలిసి కమల్‌హాసన్‌తో డిస్కషన్స్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ స్టార్ సెలబ్రిటీలంతా కలిసి దేని గురించి మాట్లాడుకుంటున్నారనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది.
ఈ మూవీలో దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ గతంలోనే ప్రాజెక్ట్ K నుంచి విడుదల చేసిన దీపికా పదుకొనే, ప్రభాస్ పోస్టర్లు.. ఈ సినిమా హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాయి. ఇప్పటికే ప్రాజెక్ట్ K రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ దీంతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. సలార్ రెండు పార్టులుగా రానుంది.
Blush 😍 #KamalHaasan #RanaDaggubati #Prabhas at #ComicCon, San Diego. #ProjectK #WhatisProjectK #ProjectKGlimpse pic.twitter.com/uMSPl0Xd8m
— Prabhas ❤ (@ivdsai) July 20, 2023
ప్రభాస్ ప్రాజెక్ట్ K తాజా లుక్..
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
శాన్ డియాగోలో అభిమానులతో కమల్‌హాసన్..
Ulaganayagan @ikamalhaasan arrives at San Diego for @Comic_Con amidst roaring fans! #ProjectK First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).#WhatisProjectK #Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/rMPBD8cuP1
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
హాలీవుడ్ రేంజ్లో దీపికాపదుకొనే లుక్..
Here's wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023