50 ఏళ్ల వయసులో బోల్డ్ కారెక్టర్ చేస్తున్న రమ్యకృష్ణ
కొందరు హీరోయిన్లకు వయసు అవుతుందేమో కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విషయంలోనూ అంతే.

కొందరు హీరోయిన్లకు వయసు అవుతుందేమో కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విషయంలోనూ అంతే. ఇప్పటికీ ఆమె అదే దూకుడు చూపిస్తుంది. 50 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతుంది. సినిమాకు కోటికి పైగా పారితోషికం అందుకుంటూ ఔరా అనిపిస్తుంది రమ్యకృష్ణ. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే.. అప్పుడప్పుడూ సంచలన పాత్రలకు కూడా ఓకే చెప్తుంది ఈ సీనియర్ హీరోయిన్. తాజాగా ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పటికే రెండేళ్ల క్రితం సూపర్ డీలక్స్ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది రమ్యకృష్ణ. అంతకుముందు మలయాళంలో కూడా బోల్డ్ క్యారెక్టర్ చేసింది. కథ డిమాండ్ చేస్తే ఇప్పటికీ బోల్డ్ సీన్లలో నటించేందుకు అభ్యంతరం లేదని హింట్ ఇచ్చేసింది. ఇప్పుడు మరోసారి బోల్డ్ పాత్రలో నటిస్తోంది. వయసు అయిపోయిన తర్వాత కూడా హార్మన్ల ప్రభావంతో కోరికలు ఎక్కువగా ఉండే మహిళ పాత్రలో రమ్యకృష్ణ నటించబోతోంది. అప్పటికే భర్త చనిపోతే.. అప్పుడు ఆమె ఏం చేయాలి.. ఏమి చేస్తే తప్పు కాదు లాంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తుంది. నిజంగా ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ లో నటించడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడు రమ్యకృష్ణ ఈ కారెక్టర్ చేయడానికి ఒప్పుకుని సంచలనం రేపుతుంది.
ఒకప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తూనే.. దేవత క్యారెక్టర్లు చేస్తూ దండాలు పెట్టించుకుంది రమ్యకృష్ణ. ఆ తర్వాత మధ్యలో కెరీర్లో కాస్త డల్ అయిన ఈమె.. బాహుబలిలో శివగామి పాత్రతో ఇండియన్ వైడ్‌గా మరోసారి స్టార్ అయిపోంది. ఆ సినిమా తర్వాత ఒక్కో సినిమాకు కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రమ్యకృష్ణ.. డబుల్ పారితోషికంతో ఈ కారెక్టర్‌కు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
ఇవి కూడా చదవండి..
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్‌లో స్టిల్
పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు.. . ‘వకీల్ సాబ్’ ఓటిటి డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
వకీల్ సాబ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా?
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
అఫీషియల్: ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాణ సంస్థ
మూడో హిందీ చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

