Bade Miyan Chote Miyan | బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ (Akshaykumar), టైగర్ ష్రాఫ్ (Tigershroff) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’ (Bade Miyan Chote Miyan). ఈ సినిమాకు ఏక్ థా టైగర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా కథనాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో మొదలైన ఈ టీజర్ పవర్‌ఫుల్‌గా సాగింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ గన్స్ పట్టుకోని ఫూల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే మరోవైపు రంజాన్ కానుకగా టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతుంది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రం ఏప్రిల్ 05న విడుదల కానుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.