Bade Miyan Chote Miyan | బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ (Akshaykumar), టైగర్ ష్రాఫ్ (Tigershroff) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బడే మియాన్ చోటే మియాన్’ (Bade Miyan Chote Miyan). ఈ సినిమాకు ఏక్ థా టైగర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా కథనాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు ఆకట్టుకున్నాయి.
ఇదిలావుంటే తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి ‘మస్త్ మలాంగ్ ఝూమ్’ సాంగ్ ని మేకర్స్ విడుదల చేసారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ మరియు సోనాక్షి సిన్హా నటించిన ఈ పాట యొక్క ఆకట్టుకునే బీట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఈ పాట మధ్యలో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్‌లు కూడా నాటు నాటు హుక్ స్టెప్ ను రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నాటు నాటు స్టెప్పులు కాపీ కొట్టారంటూ నెటిజన్లు బాలీవుడ్ స్టార్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని, వాసు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్ మరియు అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు.