Baby Movie | తమిళ్లో రీమేక్ కాబోతున్న బేబి మూవీ?
Baby Movie | ఈ మధ్య కాలంలో ఒక సినిమా వీక్ ఆడితే చాలు అదో పెద్ద సంచలనం. ఇక రెండు వారాలు ఆడిందంటే అది బంపర్ హిట్టే. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అయితే చిన్న సినిమాగా విడుదలైన బేబి మాత్రం సంచలనం అనే మాటను కూడా దాటుకొని వెళ్లింది.
Baby Movie | ఈ మధ్య కాలంలో ఒక సినిమా వీక్ ఆడితే చాలు అదో పెద్ద సంచలనం. ఇక రెండు వారాలు ఆడిందంటే అది బంపర్ హిట్టే. పెద్ద పెద్ద సినిమాలు సైతం ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. అయితే చిన్న సినిమాగా విడుదలైన బేబి మాత్రం సంచలనం అనే మాటను కూడా దాటుకొని వెళ్లింది. పట్టుమని పది కోట్ల బడ్జెట్ కూడా లేని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.90 కోట్ల మార్కును దాటేసింది. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఆ నమ్మకమే నిర్మాతల పాలిట కామధేనువులా కాసుల వర్షం కురిపించింది.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాకుండా ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సాయి రాజేషే తమిళ రీమేక్‌ను కూడా తెరకెక్కించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. SKNతో కలిసి ఓ తమిళ మీడియా సంస్థ ఈ రీమేక్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకుడు. ఇప్పుడున్న జెనరేషన్లో లవ్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా ఉందనే విధంగా సినిమాను తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ దీని పట్ల అంత సుముఖంగా లేనప్పటికీ కాలేజీ కుర్రకారుతో పాటు ఆటో మాస్ జనాలు రిపీటెడ్ షోలు వేసి అరవీర భయంకర హిట్‌ను చేసేశారు. ఇక డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ మధ్య కాలంలో ఇంత లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఏది లేదని తెగేసి చెప్పారు. నెల కిందట ఓటీటీలో రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా ఊహించని రేంజ్లో రెస్పాన్స్ తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

