హీరోయిన్ లేకుండా
ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న కొత్త సినిమా ‘ఆన్ యాక్షన్ హీరో’. ఈ చిత్రంలో జైదీప్ అహ్లవాత్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు
ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న కొత్త సినిమా ‘ఆన్ యాక్షన్ హీరో’. ఈ చిత్రంలో జైదీప్ అహ్లవాత్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. రివేంజ్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు అనిరుధ్ అయ్యర్ తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ లేకుండా తెరకెక్కడం ఈ చిత్ర ప్రత్యేకతగా చెబుతున్నారు హీరో ఆయుష్మాన్. గ్లామర్, రొమాంటిక్ అంశాలుంటే కథలోని తీవ్రతకు అడ్డు వస్తాయనే నాయికను తీసుకోలేదని ఆయన అంటున్నారు. ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ…‘ఇప్పటిదాకా నన్ను బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్లో చూశారు.
ఈ చిత్రంతో తొలిసారి యాక్షన్ కథాంశంలో నటిస్తున్నా. అనుమానాస్పదంగా మృతి చెందిన సోదరుడి మరణానికి కారణాలు తెలుసుకుని, ప్రతీకారం తీర్చుకునే పాత్రలో కనిపించబోతున్నా. ఈ చిత్రంలో ప్రేమ, రొమాన్స్ అంశాలను చేర్చితే కథ తీవ్రత తగ్గుతుందని హీరోయిన్ను తీసుకోలేదు’ అని చెప్పారు. హీరోయిన్ లేకున్నా పేరున్న ఒక నాయిక ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నదట. కథలో నాయిక లేని లోటును ఆమె తీర్చనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

